ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగుకు దిగిన భారత జట్టు 48.2 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. కోహ్లి(116; 120 బంతుల్లో 10 ఫోర్లు) సెంచరీకి జతగా, విజయ్ శంకర్(46; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకోవడంతో భారత జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్ నాలుగు వికెట్లు సాధించగా, జంపా రెండు వికెట్లు తీశాడు. కౌల్టర్ నైల్, మ్యాక్స్‌వెల్, లయన్‌లు తలో వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగుకు దిగిన ఆసీస్ జట్టు 49.3 ఓవర్లకు 242 పరుగులు చేసి అల్ అవుట్ అయింది. చివరి ఓవర్‌లో ఆసీస్ విజయానికి 11 పరుగులు అవసరం కాగా స్టాయినిస్ (52), ఆడమ్ జంపా(2)ను విజయ్ శంకర్ ఔట్ చేశాడు. ఆ జట్టును 242 పరుగులకు పరిమితం చేశాడు. దీంతో సిరీస్ 2-0తో కోహ్లీసేన ఆధిక్యంలో కొనసాగుతోంది.