మూడో టెస్టులో టీమిండియా గెలుపు

Update: 2018-12-30 02:51 GMT

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించింది. భారత్ విధించిన 399 పరుగుల లక్షాన్ని చేధించలేక ఆసీస్ చతికిల బడింది. ఈ టెస్టులో విజయం సాధించి 2–1 ఆధిక్యంలో కొనసాగుతోంది భారత్. ఇక ఓవర్ నైట్ స్కోర్ 258 పరుగులతో ఇదో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి చేతులెత్తేసింది. ఈ మ్యాచ్ లో 9 వికెట్లు తీసిన బుమ్రా కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది.

ప్యాట్‌ కమిన్స్‌ (103 బంతుల్లో 61 బ్యాటింగ్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌), షాన్‌ మార్‌‡్ష (72 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. కమిన్స్‌తో పాటు లయన్‌ (6 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉండగా. వీరిద్దరు తొమ్మిదో వికెట్‌కు అజేయంగా 43 పరుగులు జోడించారు. అయితే ఇదో రోజు బూమ్రా కమ్మిన్స్ వికెట్ తీయగా, ఇషాంత్ లియాన్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఆసీస్ 261 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాట్స్‌మన్లలో కమ్మిన్స్ 63, మార్ష్ 44, హెడ్ 34, ఖవాజా 33 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో బూమ్రా, జడేజా తలో మూడు, ఇషాంత్, షమీ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ రెండు జట్ల మధ్య నాలుగో టెస్టు జనవరి మూడు నుంచి సిడ్నీలో ప్రారంభం కానుంది. 

Tags:    

Similar News