డూ ఆర్ డై అడిలైడ్ వన్డేలో కోహ్లీసేన దుమ్ము రేపింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విక్టరీ కొట్టింది. కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీతో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆసీస్‌పై విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక మూడో వన్డే మెల్‌బోర్న్ వేదికగా జనవరి 18న జరగనుంది.