కాసేపట్లో తిరువనంతపురం వేదికగా టీమిండియా వెస్టిండీస్ మధ్య రెండో టీ20 మొదలు కానుంది. టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్ ఎంచుకుంది. తొలి టీ20 మ్యాచ్‌కు విజయం సాధించిన టీమిండియా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ విజయం కైవసం చేసుకోవాలని చూస్తుంది.
జట్లు ఇవే :
భారత జట్టు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), శివమ్ దూబే, లోకేశ్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్
వెస్టిండీస్ జట్టు: లెండిల్ సిమన్స్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), దినేశ్ రాందిన్(కీపర్),ఎవిన్ లూయిస్, బ్రాండన్ కింగ్, హెట్‌మైర్,కేస్రిక్ విలియమ్స్, జాసన్ హోల్డర్, హేడెన్ వాల్ష్, షెల్డన్ కాట్రెల్, ఖ్యారీ పిర్రే
ఇక ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్‌ని 1-1తో సమం చేయాలని వెస్టిండీస్ ఉవ్విళ్లూరుతోంది. ఉప్పల్ వేదికగా జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆ జట్టు భావిస్తుంది. వెస్టిండీస్ జరగనున్న రెండో టీ20మ్యాచ్ లో గెలిచి సిరీస్ ని కైవసం చేసుకోవాలని భారత జట్టు ఆశిస్తోంది.
Toss Update: West Indies win the toss and elect to bowl first.
— BCCI (@BCCI) December 8, 2019
Score predictions? 🤔 #INDvWI | #TeamIndia pic.twitter.com/3TIPcAperi