విండీస్‌పై భారత్ ఘన విజయం
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. తొలి టెస్ట్‌లో వెస్టిండీస్‌ను 318 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. భారత క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇది నాలుగో భారీ విజయం.
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. తొలి టెస్ట్‌లో వెస్టిండీస్‌ను 318 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. భారత క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇది నాలుగో భారీ విజయం. టీమిండియా బౌలర్లు బుమ్రా (5/7), ఇషాంత్ శర్మ (3/31), షమీ (2/13) చెలరేగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. టీమిండియా నిర్దేశించిన 419 పరుగుల ఛేదనలో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 26.5 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇషాంత్(5 వికెట్లు) విజృంభించగా.. ఈసారి బుమ్రానే ముఖ‌్య భూమిక పోషించాడు. కేవలం 7 పరుగులే ఇచ్చిన బుమ్రా 5 వికెట్లు పడగొట్టడంతో విండీస్ కుప్ప కూలింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్ నిలిచింది.