టీమిండియా విండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ భాగంగా కటక్ వేదికగా మూడో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి విండీస్‌ను భారత్ బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బ్యాటింగ్ ప్రాంభించిన విండీస్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ లూయిస్ (21 పరుగులు, 50బంతుల్లో, 3ఫోర్లు,) చేసి జాడేజా బౌలింగ్‌లో ఔటైయ్యాడు. హోప్ (42పరుగులు, 50 బంతుల్లో, 5 ఫోర్లు ) షమీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 24 ఓవర్లు ముగిసేసరిగి విండీస్ రెండు వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. ఛేజ్(18), హెట్‌మైర్ (7) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో జాడేజా, షమీ తలో వికెట్ తీశారు. ఇప్పటికే జరిగిన రెండు వన్డేల్లో ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమానంగా ఉన్నాయి.