Ind vs WI 2nd T20 : విండీస్ కట్టుదిట్టమైన బౌలింగ్.. నిరాశపరిచిన కోహ్లీ

Update: 2019-12-08 14:35 GMT
Virat Kohli File Photo

తిరువనంతపురం వేదికగా టీమిండియా వెస్టిండీస్‌ మధ్య రెండో టీ20 ఆరంభమైంది. దీంతో భారత్ 17 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసిది. కోహ్లీ (19) పరుగులతో నిరాశపరిచాడు. కేస్రిక్ విలియమ్స్ బౌలింగ్ లో లెండిల్ సిమన్స్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటైయ్యాడు. అనంతరం శ్రేయస్స్ అయ్యార్ (10) భారీ షాట్ కు యత్నించి ఔటయ్యాడు.   రిషబ్ పంత్ 27, పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో 10.3 ఓవర్ల వద్ద శివమ్ దూబే (54, 30 బంతుల్లో, 3 ఫోర్లు, 4 సిక్సు) హేడెన్ వాల్ష్ బౌలింగ్ లో హెట్‌మైర్ క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. శివమ్ దూబే టీ20 కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు.

మొదట టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు ఆదిలోనే కీలక వికెట్ కోల్పోయింది. 3.1 ఓవర్లలో జట్టు స్కోరు 24 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఓపెనర్ రాహుల్ (11 పరుగులు, 11 బంతుల్లో, 1ఫోర్ ) చేసి ఖ్యారీ పిర్రే బౌలింగ్ లో హెట్‌మైర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ( 15 పరుగులు,18బంతుల్లో,2 ఫోర్లు) పరుగులు చేసి 7.4 ఓవర్ల వద్ద జాసన్ హోల్డర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

Tags:    

Similar News