Ind vs WI 2nd ODI : నికోలస్‌ పూరన్ మెరుపు ఇన్నింగ్స్

నికోలస్‌ పూరన్ మెరుపు ఇన్నింగ్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

Update: 2019-12-18 14:30 GMT
Pooran File Photo

388పరుగుల విజయ లక్ష్యంలో బ్యాటింగ్ ఆరంభించిన విండీస్ బ్యాట్స్ మెన్ నిలకడగా ఆడుతున్నారు. విండీస్ ఓపెనర్లు ఇద్దరూ శుభారంభాన్ని ఇచ్చారు. ఓపెనర్లు ఇద్దరూ తొలి వికెట్ కు 61 పరుగుల భాగస్వామ్యం అందించారు. జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. ౩౦ ఓవర్లు ముగిసేసరికి విండీస్ ఐదు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. గత మ్యాచ్ లో భారత బౌలర్లపై విరుచుపడ్డ హెట్‌మైర్ (4)లాంగ్ ఆన్ దిశగా షాట్ ఆడాడు. బౌండరీకి వద్దకు బాల్ వెళ్లకుండా అద్భుతంగా ఫిల్డింగ్ చేసిన అయ్యర్.. బాల్‌ను బౌలర్ జడేజాకు అందించాడు. జడేజా బంతితో వికెట్లు గిరాటేశాడు.దీంతో హెట్‌మైర్ రనౌట్ గా వెనుదిరిగాడు.

విండీస్ ఓపెనర్ లూయిస్( 30పరుగులు, 35 బంతుల్లో, 5ఫోర్లు) చేసిన ఠాకుర్ బౌలింగ్ లో అయ్యార్ కు క్యాచ్ ఇచ్చి అవుటైయ్యాడు. ఈ నేపథ్యంలో వెంస్టిండీస్ 86 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ హోప్ (71పరుగులు, 75 బంతుల్లో 6 ఫోర్లు,3సిక్సులు నాటౌట్) నికోలస్‌ పూరన్ ( 75 పరుగులు 45 బంతుల్లో 6 ఫోర్లు,6 సిక్సులు) తోడవ్వడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ధాటిగా ఆడుతున్న పురాన్ ను షమీ అవుట్ కట్టర్ తో బోల్తా కొట్టించాడు. కుల్ దీప్ యాదవ్‌కు చేతికి దొరికిపోయాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన కెప్టెన్ పొలార్డ్ కూడా షమీ బౌలింగ్ లో ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. 

Tags:    

Similar News