విశాఖ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డేలో టీమిండియా విండీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. 388పరుగుల విజయ లక్ష్యంలో బ్యాటింగ్ ఆరంభించ విండీస్ బ్యాట్స్ మెన్ ధాటిగా ఆడుతున్నారు. విండీస్ ఓపెనర్లు లూయిస్( 18పరుగులు, 22 బంతుల్లో, 3ఫోర్లు) హోప్ (23పరుగులు, 25 బంతుల్లో 5 ఫోర్లో) జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. తొమ్మిది ఓవరల్లో విండీస్ 55 పరుగులు చేసింది.
అంతకుముందు టీమిండియా భారీ సోరు సాధించింది. విండీస్ ముందు 388 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ . ఓపెనర్లు సెంచరీలతో చెలరేగిపోయారు. దీంతో 50 ఓవర్లో భారత్ ఐదు వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. ఓపెనర్లు రాహుల్ (102పరుగులు, 104 బంతుల్లో, 8 ఫోర్లు, 3 సిక్సులు) సాయంతో సెంచరీ చేశాడు. మరో ఓపెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ( 159పరుగులు,138 బంతుల్లో 17ఫోర్లు, 5సిక్సు)తో ఇరువురు కలిసి తొలి వికెట్‌కు 227 పరుగుల కీలక భాగస్వామ్యం అందించారు.
అయితే వీరి జోడిని విండీస్ సారథి పొలార్డ్ విడతీశాడు. రాహుల్ 102 పరుగుల వద్ద ఉండగా పొలార్డ్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించాడు. దీంతో చేజ్ కు క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. మొదటి పవర్ ప్లేలో 55 పరుగులు మాత్రమే రాబట్టిన ఈ జోడీ రెండో పవర్ ప్లేలో భారీ స్కోరు సాధించింది. రెండో పవర్ ప్లేలో 172 పరుగులు పిండుకున్నారు. రాహుల్ , రోహిత్ ఒకరి తర్వాత పోటీ పడి ఒకరు పరుగులు వరద పారించారు.
రాహుల్ ఔట్ అయ్యినా అనంతరం బరిలోకి వచ్చిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. కోహ్లీ పరుగులేమి చేయకుండానే పొలార్డ్ బౌలింగ్ లో చేజ్ క్యాచ్ అవుట్‌గా దొరికిపోయాడు. సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ విండీస్ బౌలర్లను చీల్చిచండాడు. జట్టు స్కోరు 292 పరుగుల వద్ద రోహిత్ కాట్రల్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. శ్రేయస్స్ అయ్యార్ కేవలం 28 బంతుల్లోనే తన కెరీర్ లో ఫాస్టెట్ అర్ధసెంచరీ నమోదు చేశాడు. మొత్తం ( 53పరుగులు, 3 2బంతుల్లో 3 ఫోర్ల, నాలుగు సిక్సులు). మొదటి వన్డేలో రాణించిన పంత్ రెండో వన్డేలో కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 16 బంతులు ఎదుర్కొన్న పంత్(39) 4 సిక్సులు, 3పోర్లుతో విండీస్ బౌలర్లను ఉతికారేశాడు. కాగా, చివరి ఓవర్లలో స్కోరు సాధించే క్రమంలో పంత్, శ్రేయస్స్ అయ్యార్ ఔటయ్యారు. విండీస్ బౌలర్లలో కెప్టెన్ పొలార్డ్ 2 వికెట్లు తీసుకోగా, కాట్రెల్, పాల్ జోస్ఫ్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.