విశాఖ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్లు విజృంభిస్తున్నారు. తొలుత టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ పొలార్డ్ భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. దీంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత జట్టు 30ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(78 పరుగులు, 92 బంతుల్లో 9 ఫోర్లు, 1సిక్సు) తో అర్ధ సెంచరీ చేసి రాణిస్తున్నాడు. ఇక మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(85 పరుగులు, 86 బంతుల్లో, 7 ఫోర్లు, 3 సిక్సులు)తో విండీస్ బౌలర్లపై చెలరేగి ఆడుతూన్నాడు.