భారత్ శ్రీలంక వేదికగా జరుగుతున్న టీ20 ఊహించని మలుపు తిరుగుతుంది. అనూహ్యంగా శ్రీలంక జట్టు పుంజుకుంది. టీమిండియా ఉంచిన 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 35 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. టీమిండియా పేస్ బౌలర్లు ధాటికి లంక టాప్ ఆర్డర్ పేకమేడలా కులిపోయింది.
మరోవైపు సీనియర్ బ్యాట్స్ మెన్ మ్యాథ్యుస్ (25) డిసిల్వా (40) పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. ఇద్దరూ కలిసి 66 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. వీరి భాగస్వామ్యం వీడదీసేందుకు భారత బౌలర్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 11 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 84పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా, శార్థుల్ ఠాకుర్, నవదీప్ తాలా ఓ వికెట్ తీశారు.