India vs sri lanka 1st t20 : గెలిచిన వరుణుడు..మ్యాచ్ రద్దు

Update: 2020-01-05 16:45 GMT
India vs sri lanka 1st t20

గువాహటి వేదికగా టీమిండియా, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టి20 మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచింది. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కొద్దిసేపటికే వర్షం మొదలవడంతో ప్లేయర్లంతా డ్రసింగ్ రూమ్ కే పరిమితం అయ్యారు. అరగంటకు పైగా వర్షం కురవడంతో మైదానం చిత్తడిగా మరింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ తిరిగి ప్రారంభించడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరో సారి పిచ్ పరిశీలించిన అంపైర్లు మ్యాచు నిర్వహించడం సాధ్యం కాదని తేల్చి చేప్పారు. దీంతో మ్యాచ్ రద్దుయ్యినట్లు ప్రకటించారు. కొత్త సంవత్సరం విజయంతో ప్రారంభించాలనుకున్న టీమిండియాకు నిరాశే ఎదురైంది.




Tags:    

Similar News