విశాఖపట్నం వేదికగా భారత్, దక్షిణ ఆఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మయాంక్ డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. భారత గడ్డపై తొలిసారి టెస్టుల్లో ఆడుతున్న మయాంక్.. రోహిత్‌తో కలిసి రికార్డు భాగస్వామ్యం(317 పరుగులు) నెలకోల్పిన విషయం తెలిసిందే. మయాంక్ అగర్వాల్ 215 పరుగుల స్కోరు వద్ద పార్ట్ టైమ్ బౌలర్ డీన్ ఎల్గార్ బంతికి వెనుదిరిగాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజా, హనుమ విహారి క్రీజులో ఉన్నారు. రెండో రోజు ఆట మధ్యాహ్నం సెషన్ లో భారత్ 5 వికెట్లు కోల్పోయి 436 పరుగులతో ఆడుతోంది.