Ind vs SA 3rd Test: బ్యాడ్‌‌లైట్‌తో మ్యాచ్ రద్దు...ఆట ముగిసేసరికి భారత్ 224/3

రాంచీ వేధికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో బ్యాడ్‌ లైట్‌ కారణంగా ఆటను మొదటి రోజు నిలిపివేశారు. టీవిరామం అనంతరం తిరిగి ప్రారంభమైనా కొద్దీ సేపటికి వాతావరణం అనుకూలించే అవకాశం లేకపోవడంతో ఆటను నిలిపివేస్తున్నట్లుగా అంపైర్లు ప్రకటించారు.

Update: 2019-10-19 11:39 GMT

రాంచీ వేధికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో బ్యాడ్‌ లైట్‌ కారణంగా ఆటను మొదటి రోజు నిలిపివేశారు. టీవిరామం అనంతరం తిరిగి ప్రారంభమైనా కొద్దీ సేపటికి వాతావరణం అనుకూలించే అవకాశం లేకపోవడంతో ఆటను నిలిపివేస్తున్నట్లుగా అంపైర్లు ప్రకటించారు. మొదటి రోజు 58 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 224 పరుగులు సాధించింది. రోహిత్‌ శర్మ 164 బంతుల్లో 14ఫోర్లు 4 సిక్సర్లతో 117పరుగులు సాధించాడు. రహానే 135 బంతుల్లో, 11 ఫోర్లు, 1 సిక్సర్‌ 83 పరుగులు సాధించాడు. నాలుగో వికెట్‌కు అజేయంగా 185 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే భారత్ జట్టుకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మయాంక్ 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే రాబడ బౌలింగ్ లో ఎల్గర్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటైపోయాడు.తొమ్మిదిబంతులు ఎదుకొన్న పుజారాలను ఖాతా తెరవకుండా రాబడ చేతిలోనే ఎల్బీడబ్యూతో పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో జట్టు స్కోరు 25/2 వికెట్లు కోల్పోయింది. అనంతరం బరిలో దిగిన కెప్టెన్ కోహ్లీ కూడా 12 పరుగులు చేసి పేసర్‌ నార్జీ బౌలింగ్‌లో ఔటైయ్యాడు. దీంతో జట్టు స్కొరు 39/3 వికెట్లు కోల్పోయింది కష్టాల్లో పడింది. ఓపెనర్ రోహిత్ కు రహానే సహాకారం అంధించాడు. ధీంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగింది. బ్యాడ్‌ లైట్‌ కారణంగా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 224 పరుగులు సాధించింది.

Tags:    

Similar News