సౌతాఫ్రికాపై రోహిత్ రికార్డ్ డబుల్ సెంచరీ!
సౌతాఫ్రికా తో జరుగుతున్న మూడో టెస్ట్ లో శతకాల మోత మోగించాడు రోహిత్ శర్మ. తొలి టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు బాడిన రోహిత్ ఈ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేశాడు. టెస్టుల్లో రోహిత్ శర్మకు ఇదే తోలి డబుల్ సెంచరీ కావడం గమనార్హం.
సౌతాఫ్రికా తో జరుగుతున్న మూడో టెస్ట్ లో శతకాల మోత మోగించాడు రోహిత్ శర్మ. తొలి టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు బాడిన రోహిత్ ఈ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేశాడు. టెస్టుల్లో రోహిత్ శర్మకు ఇదే తోలి డబుల్ సెంచరీ కావడం గమనార్హం. అంతే కాకుండా ఈ డబుల్ తో అరుదైన రికార్డూ నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాపై ఓ టెస్టు సిరీస్‌లో రెండు సార్లు 150+ స్కోరు చేసిన తొలి ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఘనత సాధించాడు.
రాంచీలో జరుగుతున్న మూడో టెస్ట్ లో శనివారం సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచిన రోహిత్ శర్మ అదే జోరు రెండో రోజైన ఆదివారమూ కొనసాగించాడు. 117 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన రోహిత్ 249 బంతుల్లో 28 బౌండరీలు, 5 సిక్స్ లతో తన టెస్ట్ కెరీర్ లో తొలి డబుల్ సెంచరీని సాధించాడు.
199 పరుగుల వద్ద ఎంగిడి బౌలింగ్‌లో సిక్స్‌తో ద్విశతకాన్ని అందుకున్న రోహిత్ శర్మ (212: 255 బంతుల్లో 28x4, 6x6) ఆ ఓవర్‌లోనే మరో సిక్స్ బాదాడు. కానీ.. ఆ తర్వాత ఓవర్ వేసిన రబాడ బౌలింగ్‌లో ఫస్ట్ బాల్‌కే సిక్స్ కొట్టే ప్రయత్నంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ ఎంగిడి చేతికి చిక్కాడు. దీంతో.. రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్‌కి తెరపడింది.
ప్రస్తుతం భారత జట్టు ఐదు వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. జడేజా 17 పరుగులతోనూ, సాహా 5 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.