INDvsSA 1stODI: తొలి వన్డే వర్షార్పణం

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియా - సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దయ్యింది. ఈ మ్యాచ్‌కు పదే పదే వర్షం అడ్డంకిగా మారండంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

Update: 2020-03-12 13:27 GMT
Dharamsala Cricket Ground

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియా - సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దయ్యింది. ఈ మ్యాచ్‌కు పదే పదే వర్షం అడ్డంకిగా మారండంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. కాగా.. ఈ రోజు ఉదయం నుంచి పలు మార్లు వర్షం పడుతూ ఉండటంతో టాస్‌ పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. సాయంత్రం కాస్త తెరిపిచ్చినప్పటికీ మైదానం చిత్తడిగా మారింది. దీంతో మ్యాచ్‌ను నిర్వహించడం కష్టం కావడంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేశారు. ఇరు జట్ల మధ్య జరగాల్సిన రెండో వన్డే ఆదివారం లక్నోలో జరగనుంది.

అయితే భారత్‌-దక్షిణాఫ్రికాల వన్డే సిరీస్‌కు కరోనా భయం వెంటాడుతుంది. తొలి వన్డేకు హాజరైన ప్రేక్షకుల సంఖ్య భారీగా పడిపోయింది. ఇక మిగతా వన్డేలపై కూడా కరోనా భయం వెంటాడే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్ కూడా ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. ఇక ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మార్చి 14న సమావేశం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 4800లకు చేరాయి. భారత్ లోనూ కరోనా రోజురోజుకు వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో 73 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

  


Tags:    

Similar News