నేడు ఆక్లాండ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ ల మధ్య రెండో టి20 జరగనుంది. శుక్రవారం న్యూజిలాండ్‌తో తాడోపేడో తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో పుంజుకుంటేనే భారత్ సిరీస్ నెగ్గుకు రావొచ్చు. లేదంటే మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ ఆతిథ్య జట్టు ఖాతాలోకి వెళుతుంది. మొదటి టి20లో విజయం సాధించి మాంచి ఊపుమీదుతున్న కివీస్.. భారత్‌కు టి20 చరిత్రలోనే భారీ పరాజయాన్ని రుచిచూపించింది. ఇదే జోరుతో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించుకోవాలని భావిస్తోంది. వన్డేల్లో రెండు వన్డేలుండగానే భారత్ గెలిచినట్లే.. ఇప్పుడు టి20 సిరీస్‌లో అదే ఫలితాన్ని ఆతిథ్య జట్టు సాధించాలనుకుంటోంది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనట్టు ఏకంగా ఎనిమిది మంది బ్యాట్స్ మెన్ తో బరిలోకి దిగినా మొదటి టి20లో టీమిండియా భారీ తేడాతో బోర్లాపడింది. బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, ధవన్ , పాండ్యా సోదరులు కృనాల్, హార్దిక్ లతో పాటు ధోనీ, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ వున్నా భారత్ ఘోర పరాజయాన్ని అడ్డుకోలేకపోయారు. ఇక ఈ మ్యాచ్ లోనైనా గెలిచి సిరీస్ నిలబెట్టుకోవాలి భారత్, రెండో టీ20లో కూడా గెలిచి సిరీస్ ను చేజిక్కించుకోవాలని కివీస్ ఉంది. మరేం జరుగుతుందో చూడాలి.
జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, శుబ్‌మన్/విజయ్ శంకర్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, ధోని, హార్దిక్ పాండ్యా, కృనాల్ / కుల్దీప్, భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్/సిరాజ్, చహల్.
న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), సీఫెర్ట్, మున్రో, టేలర్, మిచెల్, నీషమ్/గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, కుగ్లీన్, సౌతీ, ఇష్ సోధి, ఫెర్గూసన్.