ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కివీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది ఓపెనర్లు మార్టిన్ గప్తిల్(13), కొలిన్ మన్రో(7) తక్కువ స్కోర్లకే అవుట్ అయ్యారు. ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో విజయాన్ని ఖాతాలో వేసుకున్న కోహ్లీసేన సిరీస్‌పై కన్నేసింది. మరోవైపు రెండు వన్డేల్లో పరాజయం పాలైన ఆతిథ్య జట్టు ఈ వన్డేలో గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది. ఇక తుది జట్టులో స్థానం సంపాదించిన ఇరు జట్ల ఆటగాళ్లు..
భారత జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కోహ్లీ, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, దినేశ్ కార్తిక్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, కుల్‌దీప్, మహమ్మద్ షమీ, యుజువేంద్ర చాహల్.
కివీస్ జట్టు: మార్టిన్ గప్తిల్, కొలిన్ మన్రో, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, టామ్ లాథమ్, హన్రీ నికోల్స్, మిచెల్, బ్రాస్‌వెల్, ఇష్ సోధీ, లాకీ, ట్రెంట్ బౌల్ట్.