కివీస్ గడ్డపై చరిత్ర సృష్టించేందుకు టీమిండియా అడుగు దూరంలో నిలిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు నెగ్గిన కోహ్లీ సేన.. మరో మ్యాచ్‌లో నెగ్గితే.. సిరీస్ వశం అవనుంది. హామిల్టన్ వేదికగా ఈ మధ్యాహ్నం జరుగనున్న మ్యాచ్‌ను ఎలాగైనా గెల్చేందుకు సిద్ధమైంది. ఇక మన టీమ్ మాత్రం.. రాహుల్, శ్రేయస్ పైనే ఆశలు పెట్టుకుంది. మొదటి రెండు మ్యాచ్‌లో కీలకపాత్ర పోషించిన ఈ ఇద్దరు కుర్రాళ్లపైనే అంచనాలు పెట్టుకున్నారు.
ఇవాళ్టి మ్యాచ్‌కు.. స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే రెండు మ్యాచ్‌లు కోల్పోయిన న్యూజీల్యాండ్ జట్టు.. హామిల్టన్ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గి.. సిరీస్‌పై ఆశలు పెట్టుకునేందుకు కసరత్తు చేస్తోంది.