IND V NZ 2nd T20I : నిలకడగా ఆడుతున్న టీమిండియా

Update: 2020-01-26 09:34 GMT
Ind Vs Nz

టీమిండియా ఓపెనర్ రాహుల్(35) , శ్రేయస్స్ అయ్యర్(19) నిలకడగా ఆడుతున్నారు. రిస్క్ చేయకుండా ఆచితూచి ఆడుతున్నారు. వీద్దరు కలసి మూడో వికెట్ కు 33 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. 12 ఓవర్లు ముగిసేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. 

న్యూజిలాండ్ నిర్ధేశించిన 132 పరుగల లక్ష్యంలో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా హిట్ మ్యాన్ ఓపెనర్ రోహిత్ శర్మ(8) రెండు ఫోర్లుతో ఊపుమీదనున్నట్లు కనిపించనప్పటికి టీమ్ సౌథీ బౌలింగ్ లో షాట్ కు యత్నించి టేలర్ చేతికి చిక్కాడు. దీంతో జట్టు స్కోరు 8 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ (11) పరుగులు సౌథీ బౌలింగ్ ఔటైయ్యాడు. మరో ఓపెనర్ రాహుల్ 20 పరుగులతో క్రీజులో ఉన్నాడు. శ్రేయస్స్ అయ్యారు క్రీజులోకి వచ్చాడు.  

Tags:    

Similar News