రాహుల్ సార్..రాహుల్ అంతే.. హోరెత్తుతున్న మీమ్స్!

న్యూజిలాండ్ పర్యటనలో భారత్‌ జట్టుకి తొలి వన్ డే లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ముగిసిన టీ20 సిరీస్ ని 5-0 తేడాతో సిరీస్ ని దక్కించుకుంది టీం ఇండియా.

Update: 2020-02-06 07:37 GMT

న్యూజిలాండ్ పర్యటనలో భారత్‌ జట్టుకి తొలి వన్ డే లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ముగిసిన టీ20 సిరీస్ ని 5-0 తేడాతో సిరీస్ ని దక్కించుకుంది టీం ఇండియా. అయితే హామిల్టన్ వేదికగా బుధవారం జరిగిన తోలి వన్ డే మ్యాచ్ లో ఇండియన్ బౌలర్లు విఫలం అవ్వటంతో కివీస్ చేతిలో 4 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో హెన్రీ నికోలస్‌ని కోహ్లీ రనౌట్ చేసిన తీరు హైలైట్‌గా నిలిచినింది, అంపైర్ డెసిషన్ కంటే ముందే వైడ్ ఇచ్చిన కేఎల్ రాహుల్, భారీగా పరుగులిచ్చిన కుల్దీప్ యాదవ్‌పై క్రికెట్ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు.

రాహుల్ అదరగొట్టాడు..

టీ20ల్లో ఓపెనర్‌గా ఆడిన కేఎల్ రాహుల్‌ని హామిల్టన్ వన్ డేలో టీమిండియా నెం.5లో ఆడించింది. అది కూడా 29వ ఓవర్ లో క్రీజులోకి వచ్చిన రాహుల్ అసాధారణ రీతిలో విజృంభించాడు. అతడిని కట్టడి చేసేందుకు న్యూజిలాండ్ జట్టు సారధి బౌలర్లని మార్చినా ఆఖరి వరకూ ప్రయోజనం లేకపోయింది. స్పిన్నర్లు, పేసర్లు అని తేడా లేకుండా అందరి బౌలర్లను ఓ ఆటాడుకున్న రాహుల్ 6 సిక్సర్లు కొట్టాడు. రాహుల్ ఈ మ్యాచ్ల్ లో (88: 64 బంతులలో 3*4, 6*6)తో నాటవుట్ గా నిలిచాడు.



వృధా అయిన శ్రేయాస్ అయ్యర్ శతకం..

తోలి వన్ డే లో శ్రేయాస్ అయ్యారు (103: 107 బంతుల్లో 11*4, 1*6), కే ఎల్ రాహుల్ (88 నాటౌట్: 64 64 బంతుల్లో 3*4, 6*6) తో దూకుడుగా ఆడటంతో 50 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ జట్టు 4 వికెట్ల నష్టానికి 347 పరుగు చేసింది. తరువాత లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ప్లేయర్ రాస్ టేలర్ (109 నాటౌట్: 84 బంతుల్లో 10*4, 4*6)తొ అజేయ శతకం బాదటంతో కివీస్ 48.1 ఓవర్ల లోనే 348/6తో విజయాన్ని అందుకుంది. హెన్రీ నికోలస్ (78: 82 బంతుల్లో 11*4)‌ని రనౌట్ చేసిన కోహ్లీ భారత్‌ని మళ్లీ మ్యాచ్‌లోకి తెచ్చినా, కాచ్ని వదిలేసిన కుల్దీప్ యాదవ్, 10 ఓవర్లు వేసి 84 పరుగులు సమర్పించుకుని మ్యాచ్‌ని చేజార్చాడు.


ఎక్సట్రాలే కారణం.. 

భారత్ జట్టు ఓటమికి ఎక్స్ ట్రాలు కుడా ఓ కారణం. ఎంత అంతే.. టీం ఇండియా పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఏకంగా 13 ఎక్‌ట్రా రన్స్ ఇవ్వగా, మహ్మద్ షమీ 7, శార్ధూల్ ఠాకూర్ రెండు, జడేజా, కుల్దీప్ యాదవ్ చెరొక పరుగు ఇచ్చారు. మొత్తం మీద ఎక్స్ ట్రాల రూపంలో భారత్ జట్టు ఈకంగా 24 పరుగులు సమర్పించుకుంది. మరోవైపు ఆల్‌రౌండర్ రూపంలో కేదార్ జాదవ్ టీమ్‌లో ఉన్నా కెప్టెన్ కోహ్లీ వినియోగించుకోలేదు.



చివరిగా రాస్ టేలర్.. ముగించాడు

ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన 5 టీ20 మ్యాచ్‌ల్ని సూపర్ ఓవర్ వరకూ తీసుకెళ్లి విమర్శలు ఎదుర్కున్న న్యూజిలాండ్ జట్టు ఎట్టకేలకి మ్యాచ్‌ని ముగించగలిగింది. చివరిలో పరుగుల మధ్య అంతరం తగ్గుతున్న దశలో, నాలుగు బంతుల వ్యవధిలోనే జేమ్స్ నీషమ్ (9), కొలిన్ గ్రాండ్ హోమ్ (1 రనౌట్) వరుసగా వికెట్లు చేజార్చుకోవడం చూసి ఈ మ్యాచ్ కూడా మల్లి చేయజార్చుకుంటుందని అంతాఅనుకున్నారు. అయితే ఈసారి వారి అంచనాలు తలకిందులయ్యాయి. రాస్ టేలర్ టీం ఇండియాకు ఆ ఛాన్స్ లేకుండా చివరి వరకు క్రీజులో నిలిచి సెంచరీతో మ్యాచ్ ని ముగుంచాడు.




ఫీల్డింగ్ లో కోహ్లీ విశ్వరూపం.. 

విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌లో అదరగొట్టాడు. ఇన్నింగ్స్‌ 29వ ఓవర్ వేసిన జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ బంతిని కవర్స్ దిశగా ఫుష్ చేశాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ బంతిని అందుకుని డైవ్ చేస్తూ వికెట్లపైకి బంతిని విసిరాడు. అప్పటికే రనౌట్ ప్రమాదాన్ని పసిగట్టిన హెన్రీ నికోలస్ డైవ్ చేసినా లాభం లేకపోయింది.




కోహ్లీ vs లెగ్ స్పిన్నర్ ఇస్ సోధీ..

మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ (51: 63 బంతుల్లో 6*4) మంచి జోరుమీద కనిపించాడు. కానీ.. ఇన్నింగ్స్ 29వ ఓవర్ వేసిన లెగ్ స్పిన్నర్ ఇస్ సోధీ తెలివిగా గూగ్లీని సంధించాడు. బ్యాట్ ఎడ్జ్ తాకుతూ వెనక్కి వెళ్లిన బంతి లెగ్ స్టంప్‌- మిడిల్ స్టంప్‌పై ఉన్న బెయిల్‌ని ఎగరగొట్టింది. బంతి వెళ్లిన తీరుకి కోహ్లీ సైతం ఆశ్చర్యపోయాడు. మ్యాచ్‌లో ఇస్ సోధీ వేసిన తొలి ఓవర్‌లోనే కోహ్లీ వికెట్ పడగొట్టడం గమనార్హం.  






Tags:    

Similar News