సెమీస్ పోరులో టీమిండియా ఓటమి చవిచూసింది. 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో చతికిల పడింది. కానీ ఈ పోరులో జడేజా, ధోనీ పోరాటం మాత్రం అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఓడినా ఏం ఆడారురా అనిపించేలా చేసింది. నిన్నటివరకు ఒక ఎక్ట్రా ప్లేయర్ గా ఫెవీలయన్ గా ఉన్న జడేజా భారత క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. చివర్లో జడ్డూ అవుట్ అయినా అతని పోరాటానికి మాత్రం నెటిజన్లు ఫిదా అయిపోయారు. మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఐదేళ్ల క్రితం న్యూజిలాండ్‌తో పోరులో జెడేజా చేసిన మ్యాజిక్‌నే రిపీట్ చేస్తాడని అందరూ భావించారు. అయితే అప్పటిలాగే కివీస్‌తో పోరాటం చేసినా కూడా చివరకు మాత్రం అప్పటి ఫలితం మాదిరి రాలేదు.
సెమీస్ పోరులో వందకు మించిన పరుగుల భాగస్వామ్యంతో రవీంద్ర జడేజా-మహేంద్ర సింగ్ ధోనీలు రాణించారు. ముఖ్యంగా జడేజా 59 బంతుల్లోనే 77 పరుగులు సాధించాడు. మరోవైపు ధోనీ నెమ్మదిగా ఆడుతూ అతనికి సహకారం అందించాడు. 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఏడో వికెట్ ను 116 పరుగులు జోడించారు. 59 బాల్స్ లోనే 77 పరుగులు చేసి కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన జడేజా మ్యాచ్‌ని మాత్రం గెలిపించలేదు. అయితే మిగిలిన బ్యాట్స్‌మెన్లు కంటే మాత్రం బెటర్‌గా ఆడి గ్రేట్ అనిపించుకున్నారు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు మాదిరిగా చేతులెత్తేయలేదంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంత బాగా ఆడిన జడేజాను ఇన్ని మ్యాచుల్లో ఫెవీలియన్ లో కూర్చో పెట్టడాన్ని మండి పడుతున్నారు జడ్డూ వెరీగుడ్డు అంటున్నారు క్రికెట్ ప్రేమికులు.