ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పతిప్పలు పెట్టారు. 134 పరుగులకే ఆలౌట్ చేశారు. రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు పడగొట్టగా..అక్షర్ పటేల్ 2 వికెట్లు..ఇషాంత్ శర్మ 2 వికెట్లు పడగొట్టాడు. 60 ఓవర్ పూర్తికాకముందే ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.