3rd T20: ఇంగ్లాండ్ లక్ష్యం 157: కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ (77*)
3rd T20: కోహ్లీ కెప్టెన్ ఇన్సింగ్స్ తో ఆకట్టుకున్నాడు. కోహ్లీ ఒక్కడే బ్యాటింగ్ భారాన్ని భుజాన వేసుకుని నడిపించాడు.
India vs Engalnd 3rd T20: కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. కోహ్లీ ఒక్కడే బ్యాటింగ్ భారాన్ని భుజాన వేసుకుని నడిపించాడు. దీంతో 20 ఓవర్లకు టీమిండియా 156పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ టీం ముందు 157 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఇండియాకు ఈ మ్యాచ్ లోనూ శుభారంభం దక్కలేదు. ఇంగ్లాండ్ పేస్ ధాటికి వెంట వెంటనే వికెట్లు కొల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. కానీ, కోహ్లీ 77 పరుగులు(46 బంతులు, 8 ఫోర్లు, 4 సిక్సులు) అద్భుత బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం చూపించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా దూకుడుగా ఆడాడు.
కాగా, రోహిత్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ ప్రారంభించారు. రాహుల్ యథావిధిగా డకౌవుట్ గా వెనుదిరిగి నిరాశపరిచాడు. కేఎల్ రాహుల్ (0; 4 బంతుల్లో) డకౌట్ అయ్యాడు. మార్క్‌వుడ్ వేసిన 2.3వ బంతిని ఆడబోయి అతడు క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మూడు మ్యాచుల్లో అతడి స్కోర్లు 1, 0, 0. బ్యాటు, ప్యాడ్ల మధ్య నుంచి వేగంగా దూసుకొచ్చిన బంతి వికెట్లను తాకేసింది.
ఆతరువాత టీమ్‌ఇండియా రెండో వికెట్ చేజార్చుకుంది. మార్క్‌వుడ్ వేసిన 4.4వ బంతికి రోహిత్ (15; 17 బంతుల్లో 2×4) ఔటయ్యాడు. 146 కి.మీ వేగంతో వచ్చిన షార్టపిచ్ బంతిని పుల్‌చేయబోయి లెగ్‌సైడ్లో ఆర్చర్ చేతికి చిక్కాడు. రోహిత్ జట్టులోకి వచ్చిన ఆనందం లేకుండా పోయింది. రెండో మ్యాచ్ లో అద్భుత బ్యాటింగ్ తో ఆకట్టుకుంటాడనుకున్న ఇషాంత్ కూడా పెవిలియన్ చేరడంతో టీమిండియా వెనువెంటనే రెండు వికెట్లను కోల్పోయింది. జోర్డాన్ వేసిన 5.2వ బంతికి ఇషాన్ కిషన్ (4; 9 బంతుల్లో) ఔటయ్యాడు. మంచి వేగం, బౌన్స్‌తో వచ్చిన బంతిని కిషన్ కీపర్ వెనక్కి ఆడాడు. బట్లర్ సులువుగా బంతిని అందుకున్నాడు.
అనంతరం కోహ్లీ బ్యాటింగ్ కి వచ్చాడు. బ్యాటింగ్ భారమంతా కెప్టెన్ విరాట్ కోహ్లీ పై పడింది. దీంతో కోహ్లీ ఆచితూచి ఆడుతున్నాడు. పంత్ కోహ్లీకి తోడుగా ఉండి బ్యాటింగ్ చేస్తాడనుకుంటే... పంత్(25 పరుగులు, 20 బంతులు,3 ఫోర్లు) కూడా సామ్ కర్రన్ బౌలింగ్ లో రనౌట్ గా వెనుదిరిగాడు. కోహ్లీ తోడుగా బ్యాటింగ్ కి వచ్చిన హార్దిక్ పాండ్య17 పరుగులు (15బంతులు, 2 సిక్సులు) తో కలిసి ఇన్సింగ్స్ ను పునర్మించాడు కోహ్లీ. కానీ లాస్ట్ ఓవర్లో చివరి బాల్ కు హిట్టింగ్ చేయబోయి హార్దిక్ ఔటయ్యాడు.
ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో మార్కు వుడ్ 3, జోర్దాన్ 2 వికెట్లు తీశాడు. మిగిలిన వారు అంతగా ప్రభావం చూపలేదు.