పొట్టి సమరానికి సిద్ధం

సొంతగడ్డపై సౌతాఫ్రికాను చిత్తుచేసిన భారత్ ఢిల్లీ వేదికగా నేడు మరో సమరానికి సిద్దమైంది. టి20 ఫార్మాట్‌తో సిరీస్‌ను ప్రారంభించనుంది. కెప్టెన్ కోహ్లి విశ్రాంతి తీసుకోవడంతో రోహిత్ శర్మ నాయకత్వంలో బంగ్లాదేశ్‌తో భారత్ మూడు టీ20లు ఆడనుంది.

Update: 2019-11-03 04:52 GMT

సొంతగడ్డపై సౌతాఫ్రికాను చిత్తుచేసిన భారత్ ఢిల్లీ వేదికగా నేడు మరో సమరానికి సిద్దమైంది. టి20 ఫార్మాట్‌తో సిరీస్‌ను ప్రారంభించనుంది. కెప్టెన్ కోహ్లి విశ్రాంతి తీసుకోవడంతో రోహిత్ శర్మ నాయకత్వంలో బంగ్లాదేశ్‌తో భారత్ మూడు టీ20లు ఆడనుంది. ఇందులో భాగంగా సీనియర్లతో పాటు పలువురు కుర్రాళ్లు కూడా టీమిండియా తరఫున సత్తా చాటనున్నారు. భారత్ బ్యాటింగ్ బౌలింగ్ పరంగా బలంగానే ఉంది. రోహిత్‌ శర్మ ఫామ్ లో ఉన్నాడు అతడు చెలరేగిపోతే తిరుగుండదు. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ రాణింస్తే మాత్రం భారీ స్కోర్ సాధిస్తుంది. శివమ్‌ దూబే ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేయడం ఖాయమే. శివమ్‌ దూబే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగల సమర్ధుడు. దేశవాలి క్రికెట్ లో రాణించి టీమిండియాకు ఎంపికైయ్యాడు.

అయితే బంగ్లా జట్టులోనూ స్టార్ ఆల్ రౌండర్ కెప్టెన్ షకీబ్‌ ఫిక్సింగ్‌ వివాదంతో నిషేధానికి గురికావడంతో ఆ జట్టుకు నిరాశపరిచేంది. అయినప్పటికీ పలువురు యువ ఆటగాళ్లు భారత్ పై విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. మహ్ముదుల్లా, ముస్తఫిజుర్‌, ముష్ఫికర్, జట్టులో కీలక ఆటగాళ్లు, వ్యక్తిగత కారణాలతో తమీమ్‌ ఇక్బాల్ తప్పుకోవడంతో ఆ జట్టు బ్యాటింగ్‌ బలహీనంగా కలిపిస్తుంది. బంగ్లాదేశ్‌తో భారత జట్టు ఇప్పటి వరకు 8 టి20 మ్యాచ్‌లు ఆడింది అన్నింటిలో ఘన విజయాలు నమోదు చేసుకుంది

జట్లు వివరాలు చూస్తే

భారత్‌:

రోహిత్‌ (కెప్టెన్‌), ధావన్, రాహుల్‌/సామ్సన్, శివమ్‌ దూబే, పంత్, అయ్యర్, కృనాల్, వాషింగ్టన్, శార్దుల్‌/ఖలీల్ చహల్, దీపక్‌ చహర్.

బంగ్లాదేశ్‌:

మహ్ముదుల్లా (కెప్టెన్‌), ముష్ఫికర్, మొసద్దిక్, అఫీఫ్, దాస్, సర్కార్, నయీమ్, అరాఫత్, ముస్తఫిజుర్, అల్‌ అమీన్, అబూ హైదర్‌/తైజుల్‌.

Tags:    

Similar News