నాగ్‌పూర్ విదర్భ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌లో జరుగుతున్న మూడో టీ20లో భారత్ నిర్ణిత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. మొదట టాస్ గెలిచిన బంగ్లా ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించన టీమిండియా ఆదిలో కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ చేజార్చుకుంది. ఆరు బంతులు ఎదుర్కొన్న రోహిత్ రెండు పరుగుల చేసి జట్టు వ్యక్తి గత స్కోరు 3 పరుగుల వద్ద సైపుల్ ఇస్లామ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రెండు టీ20లల్లో రాణించిన మరో ఓపెనర్ శిఖర్(19 4X4) ధావన్ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. సైపుల్ ఇస్లామ్ వేసిన బంతిని ఎదర్కొనే క్రమంలో మహ్మదుల్లాకు క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు.
35/2 కీలక వికెట్లు కోల్పోయిన భారత్ లోకేశ్ రాహుల్, శ్రేయస్స్ ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ధాటిగా ఆడుతున్న లోకేశ్ రాహుల్ 35 బంతుల్లో ఏడు ఫోర్లతో 52 పురుగులు చేసి అల్ అమిన్ బౌలింగ్ లో మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. శ్రేయస్స్ అయ్యార్(62, 33 బంతుల్లో 3x4, 5x6) సౌమ్య సర్కార్ బౌలింగ్ లో లిప్టన్ దాస్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో సైపుల్ ఇస్లామ్, సౌమ్య సర్కార్ చెరి 2 వికెట్లు తీసుకున్నారు. హుస్సెన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.