Ind vs Ban 2nd Test : ఎనిమిదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
తొలి డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు విజృంభిసున్నారు. భారత బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాట్స్ మెన్స్ ఒక్కొక్కరిగా పెవిలియన్ క్యూ కడుతన్నారు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాతో జరుగుతున్న తొలి డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు విజృంభిసున్నారు. భారత బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాట్స్ మెన్స్ ఒక్కొక్కరిగా పెవిలియన్ క్యూ కడుతన్నారు. ప్రస్తుతం 28 ఓవర్లు ముగిసేసరికి బంగ్లా ఎనమిది వికెట్లు నష్టపోయి 98 పరుగులు చేసింది. ఎనమిదో వికెట్ గా మెహదీ హసన్ 8(13 ) వెనుదిరిగాడు..
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా 15 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. బంగ్లా ఓపెనర్ ఇమ్రుల్ కయోస్ 15బంతులు ఆడి 4పరుగులు చేసి ఏడో ఓవర్‌లోనే టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన కెప్టెన్ మొమినుల్ హాక్ ఉమేష్ బౌలింగ్ లో పరుగులేమి చేయకుండానే వెనుదిరిగాడు. మిథున్ ను కూడా ఉమేష్ ఔట్ చేశాడు.