రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టు టీమిండియా ఫేస్ బౌలర్ల దాటికి 50 పరుగులలోపే టాప్ ఆర్డర్ మొత్తం పేకమేడలా కూలిపోయింది. తొలి సెషన్ లోనే కీలక వికెట్లు చేజారడంతో బంగ్లా ఎదురీదుతుంది. భారత్ జట్టు తొలి ఇన్సింగ్ లో సాధిచింన 343 పరుగులను అధిగమించాలంటే బంగ్లాకు 283 పరుగులు అవసరం. ముష్ఫికర్ రహీమ్ (9) మహ్మదుల్లా (6) పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో లంచ్ విరామ సమయానికి 4వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. భారత బౌలర్లలో షమీ రెండు, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మూడో రోజు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ని 493/6 వద్ద డిక్లేర్ చేస్తున్నట్లు కోహ్లీ ప్రకటించారు. 343 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
Keywords : India vs Bangladesh. 1st Test , Bangladesh ,Struggling Hard, second innings