Ind vs Ban 1st-Test Day 2 : మయాంక్ సెంచరీ

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు రెండో రోజు భారత బ్యాట్స్‌మెన్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీ సాధించాడు.

Update: 2019-11-15 07:19 GMT
mayank agarwal

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు రెండో రోజు భారత బ్యాట్స్‌మెన్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీ సాధించాడు. భోజన విరామం తర్వాత రెండో సెషన్ ప్రారంభించిన టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 83 బంతుల్లోనే 15 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో సెంచరీ చేశాడు. టెస్టు కెరీర్‌లో మయాంక్ మూడో సెంచరీ కాగా సౌతాఫ్రికాపై డబుల్ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. మయాంక్ జోరు కొనసాగిస్తున్నాడు దీంతో 60 ఓవర్లలో 206/3తో కొనసాగిస్తోంది. మరో ఆటగాడు రహానే (44 పరుగులు 95 బంతుల్లో 6ఫోర్ల)తో రాణిస్తున్నాడు. బంగ్లాపై 56 పరుగుల ఆధిక్యం ఉంది.

ఓవర్ నైట్ స్కోరు 86/1తో రెండో రోజు బరిలోకి దిగిన భారత్ ఆట ప్రారభంలోనే 15 పరుగుల వ్యవధిలో రెండు కీలక వికెట్లను భారత్ చేజార్చుకుంది. రెండో రోజు ప్రారంభమైన టెస్టులో 105 పరుగుల వద్ద చెతేశ్వర్ పుజారా( 54 పరుగులు 72 బంతుల్లో 9 ఫోర్లు) వికెట్ కోల్పోయింది. జాయేద్ బౌలింగ్‌లో సబ్ స్టిట్యూ ప్లేయర్ హసన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పరుగులులేమి చేయకుండానే వెనుదిరిగాడు. జాయేద్ బౌలింగ్ లో ఎల్బీడబ్యూ రూపంలో 119-3 వికెట్లు కోల్పోయింది ఆవుటైయ్యాడు.

తొలి రోజు మొదటి ఇన్నింగ్స్ ఆట ముగిసే సమయానికి భారత్ 86/1(26 ఓవర్లు) పరుగులు చేసింది. మూడో సెషన్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. జట్టు 14 పరుగుల వద్ద రోహిత్ జాయద్ బౌలింగ్‌లో లిప్టన్ దాసుకు క్యాచ్ ఇచ్చి దొరికిపోయిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News