ఆస్ట్రేలియాతో జరుగుతున్న పాంచ్ పటాకా సిరీస్ లోని ఆఖరి రెండు వన్డేల నుంచి సీనియర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీకి విశ్రాంతి ఇచ్చినట్లు బీసీసీఐ ప్రకటించింది. మొహాలీ, న్యూఢిల్లీ వేదికలుగా జరిగే ఆఖరి రెండు వన్డేలలో యువఆటగాడు రిషభ్ పంత్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా వ్యవహరిస్తాడు. కాలిగాయంతో బాధపడుతున్న ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి సైతం విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది. హోంగ్రౌండ్ రాంచీ వేదికగా తన ఆఖరి వన్డే మ్యాచ్ ఆడిన ధోనీ 26 పరుగుల స్కోరు మాత్రమే సాధించగలిగాడు.