IND V AUS 3rd ODI : కోహ్లీ హాఫ్ సెంచరీ.. విజయానికి చేరువుగా టీమిండియా

మూడో వన్డేలో భారత్ విజయం దిశగా పయనిస్తుంది.

Update: 2020-01-19 14:44 GMT
విరాట్ కోహ్లీ

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ విజయం చేరువలో ఉంది. ఓపెనర్ రోహిత్ శర్మ(118), కోహ్లీ(59 పరుగులు, 64బంతుల్లో, 5 ఫోర్లు) అర్థ సెంచరీతో రాణిస్తున్నాడు. కమిన్స్ వేసిన 36వ ఓవర్ లో టీమిండియా సారథి కోహ్లీ వరుస బంతులను ఫోర్లుగా మలిచాడు. దీంతో వన్డేల్లో 57వ అర్థ శతకం సాధించాడు. కమిన్స్ వేసిన 36వ ఓవర్లో మొత్తం 13 పరుగులు రాబట్టాడు. 36 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి 205 పరుగులు చేసింది. రెండో వికెట్ కు కోహ్లీ, రోహిత్ కలిసి 130పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.   



Tags:    

Similar News