మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ధాటిగా ఆడుతున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తనకు కలిసి వచ్చిన మైదానంలో మరోసారి చెలరేగిపోయాడు. 57 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 15 ఓవర్ లో ఆగర్ బౌలింగ్ అర్థసెంచరీ సింగిల్ తీసి అర్థసెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో కెరీర్ తన 44వ అర్థసెంచరీ నమోదు చేసుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ (69పరుగులు,81 బంతుల్లో, 7 ఫోర్లు, 3సిక్సు)లతోనూ, కోహ్లీ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. 21 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి భారత్ 101 పరుగులు చేసింది. గతంలో ఇదే మైదానంలో ఆసీస్ పై రోహిత్ డబుల్ సెంచరీ సాధించాడు.