IND V AUS 3rd ODI : చివరి ఓవర్లలో షమి మెరుపులు.. భారత్ లక్ష్యం చిన్నదే !
బెంగళూరు వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా భారత్ ముందు 287 పరుగుల లక్ష్యం ఉంచింది. నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మింది వికెట్లు కోల్పోయి 286 పరుగులు సాధించింది. దీంతో టీమిండియా ముందు 287 లక్ష్యం ఉంచింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్ సూపర్ ఫామ్ లో ఉన్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ వికెట్ ను 18 పరుగుల వద్ద కోల్పోయింది. వెంటనే జట్టు 46 పరుగుల వద్ద మరో ఓపెనర్ కెప్టెన్ ఫించ్ టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ వేసిన ఓవర్ లో సింగల్ కోసం ప్రయత్నించాడు. స్మిత్ నిరాకరించడంతో క్రీజులోకి వెళ్లే క్రమంలో ఫించ్ రనౌటైయ్యాడు. దీంతో కష్టాల్లో పడిన జట్టును స్మిత్, లబుషేన్ ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 127 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఒక దశలో 350 పరుగులు సాదింస్తుందనుకున్న ఆసీస్ క్రమంలో జడేజా వేసిన మూడో బంతికి మార్నస్ లుబుషేన్ (54 పరుగులు, 64 బంతుల్లో, 5ఫోర్లు ) కెప్పెన్ కోహ్లీ చేతికి దొరికిపోయాడు. జడేజా వేసిన 32వ ఓవర్లో ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయింది.
ఇక అదే ఓవర్‌లో చివరి బంతికి విచెల్ స్టార్క్(0) గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు. స్టార్క్ భారీ షాట్ కు యత్నించి చాహల్ చేతికి చిక్కాడు. దీంతో ఆసీస్ స్కోరు నెమ్మదించింది. క్రీజులోకి వచ్చిన ఆలెక్స్ కారే (35, 36బంతుల్లో 6X4 ) పరుగులతో వేగంగా ఆడాడు. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో శ్రేయస్స్ అయ్యారుకు క్యాచ్ ఔట్ రూపంలో వెనుదిరిగాడు. టీమిండియా బౌలర్లపై దాటిగా ఆడిన ఆసీస్ బ్యాట్స్‌మెన్ స్మిత్ (131 పరుగులు, 132బంతులు, 14 ఫోర్లు, 1 సిక్సు)లతో సెంచరీ చేశాడు. 44 ఓవర్లో సెంచరీ సాధించిన స్మిత్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 48 ఓవర్లో షమీ వేసిన తొలి బంతికి స్మిత్ భారీ షాట్ కు యత్నించి పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం వచ్చిన పాట్ కామిక్స్, జాంపాను క్లీన్ బౌల్డ్ చేశాడు షమీ. దీంతో ఆస్ట్రేలియా తొమ్మిది కోల్పోయింది. టీమిండియా బౌలర్లలో షమీ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. జడేజా రెండు వికెట్లు తీసుకున్నాడు. నవదీప్ షైనీ, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. బుమ్రా ఈ మ్యాచ్ లో నిరాశపరిచాడు.
Shami bowls an excellent spell at the death, as India restrict Australia to 286/9 🚫
— ICC (@ICC) January 19, 2020
Steve Smith scored a masterful 131 in that innings 👏#INDvAUS SCORECARD ⬇️https://t.co/KpYQeic8ys pic.twitter.com/DUWXt2pDON