IND v AUS 1st ODI : సెంచరీలతో కదంతొక్కిన ఆసీస్ ఓపెనర్లు

Update: 2020-01-14 14:15 GMT
Warner

ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ సెంచరీలతో కందం తొక్కారు . 256 లక్ష్య ఛేదనలో భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఆకాశమే హద్దుగా సిక్సర్లు ఫోర్లతో భారత బౌర్లపై చెలరేగిపోయారు. వాంఖేడే వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా నిర్దేశించిన 256పరుగుల లక్ష‌్యంతో ఆస్ట్రేలియా బరిలోకి దిగింది. ఆ జట్టు ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (115 పరుగులు, 102బంతుల్లో, 15ఫోర్లు, 3 సిక్సులు), ఆరోన్‌ ఫించ్‌(109, 105 బంతుల్లో 13ఫోర్లు, 2 సిక్స్) చేశారు. 36ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా ఆస్ట్రేలియా 244 పరుగులు చేసింది. 


 

Tags:    

Similar News