భారత్ ఆసీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ మంగళవారం ప్రారంభమైంది. శిఖర్ ధావన్(37), రాహుల్(16) జంట 50 పరుగులు భాగస్వామ్యం నమోదు చేసింది. ముంబైలోని వాంఖేడేలో జరుగుతున్న తొలి వన్డేలో మొదట టాస్ గెలిచి ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ఆదిలో తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ (10) జట్టు స్కోరు 13 పరుగుల వద్ద ఔటైయ్యాడు. 4.3 ఓవర్ల వద్ద స్టార్క్ బౌలింగ్ లో వార్నార్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 14 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి భారత్ 66 పరుగులు చేసింది. రాహుల్ ,ధావన్ క్రీజులో ఉన్నారు.
A steady 50-run partnership comes up between this duo.#INDvAUS pic.twitter.com/iwjocRaPeW
— BCCI (@BCCI) January 14, 2020