తొలి వికెట్ కోల్పోయిన భారత్

Update: 2020-01-14 08:56 GMT
India vs australia 1st odi

భారత్ ఆసీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ మంగళవారం ప్రారంభమైంది. వాఖండేలో జరుగుతున్న తొలి వన్డేలో మొదట టాస్ గెలిచి ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది.

బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ఆదిలో తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ (10) జట్టు స్కోరు 13 పరుగుల వద్ద ఔటైయ్యాడు. 4.3 ఓవర్ల వద్ద స్టార్క్ బౌలింగ్ లో వార్నార్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శిఖర్ ధావన్(34), రాహుల్ (10) పరుగులతో రాణిస్తున్నారు. 12 ముగిసేసరికి ఓవర్లు ఒక వికెట్ నష్టానికి భారత్ 55 పరుగులు చేసింది.

శ్రీలంక సిరీస్‌తో విశ్రాంతి తీసుకున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఆసీస్ పర్యటనలో జట్టులోకి పునరాగమనం చేశాడు. ఈ సిరీస్ లో రోహిత్ తోపాటు శిఖర్ ధావన్ ఓపెనర్ గా బరిలో దిగాడు. కేఎల్ రాహుల్ మూడో బ్యాట్స్ మెన్ గా వచ్చాడు.

  

 

Tags:    

Similar News