భారత్ విజయ లక్ష్యం 228

Update: 2019-06-05 11:26 GMT

వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా తోలి మ్యాచ్ ప్రథమార్థం పూర్తయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న సోతాఫ్రికా జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. టాప్ ఆర్డర్ ను తమ పటిష్టమైన బౌలింగ్ తో కూల్చేసింది ఇండియా. ఓపెనర్లిద్దర్నీ తక్కువ పరుగులకే కోల్పోయిన దశలో ఒక్కో పరుగునూ పేరుస్తూ.. దక్షిణాఫ్రికా సారధి డుప్లిసిస్ తన సహచరుడు డుస్సేన్ తో కలసి ఇన్నింగ్స్ కు మరమ్మతులు చేశాడు. కానీ ఈ ఇద్దరినీ వరుస బంతుల్లో చాహల్ కేలీన్ బౌల్డ్ చేయడంతో సౌతాఫ్రికా పరిస్థితి గందరగోళం అయింది. తరువాత వచ్చిన వారిని పరుగులు చేయకుండా కట్టడి చేశారు భారత బౌలర్లు. అయితే.. మళ్ళీ వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది దక్షిణాఫ్రికా. ఈసారి కుల్దీప్ డుమిని ని బోల్తా కొట్టించాడు. తరువాత నిలకడగా ఆడుతున్న ఫెలూక్వాయే, మిల్లర్లు కూడా ఒక్కసారే అవుటయ్యాడు. దాంతో బ్యాటింగ్ కు దిగిన మోరిస్, రాబడాలు దక్షిణాఫ్రికా ను కొంతవరకూ మంచి స్కోరు దిశగా నడిపించారు. వీరిరువురి జోడీ సహాయంతో దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లను 227 పరుగులు చేయగలిగింది.   

సౌతాఫ్రికా బ్యాటింగ్..

ఆమ్లా              క్యాచ్: రోహిత్ శర్మ, బౌల్: బుమ్రా      9 బంతుల్లో    6 పరుగులు 

డికాక్              క్యాచ్: కోహ్లీ, బౌల్: బుమ్రా            10  బంతుల్లో  17 పరుగులు

డుప్లెసిస్           బౌల్డ్  చాహల్                             54 బంతుల్లో   38 పరుగులు

డుస్సేన్            బౌల్డ్ చాహల్                              37 బంతుల్లో   22  పరుగులు

మిల్లర్              క్యాచ్ అండ్ బౌల్డ్ చాహల్              40  బంతుల్లో   31 పరుగులు

డుమిని            ఎలిబీడబ్ల్యు కులదీప్                    11  బంతుల్లో    3  పరుగులు

ఫెలూక్వాయే     బౌల్డ్ చాహల్                               37   బంతుల్లో 22 పరుగులు

మోరిస్            క్యాచ్: కోహ్లీ, బౌల్: భువనేశ్వర్        34   బంతుల్లో  42   పరుగులు

రబడా            నాటౌట్                                       35  బంతుల్లో   31  పరుగులు

ఇమ్రాన్ తాహిర్ క్యాచ్: జాదవ్ , బౌల్: భువనేశ్వర్        2 బంతుల్లో    0  పరుగులు

భారత్ బౌలింగ్ 

భువనేశ్వర్ కుమార్          10 ఓవర్లు - 44  పరుగులు - 2 వికెట్లు 

జస్ప్రీత్ బుమ్రా                 10 ఓవర్లు - 35  పరుగులు - 2 వికెట్లు 

హార్దిక్ పాండ్య                     6   ఓవర్లు - 31 రుగులు -  0 

కుల్దీప్ యాదవ్            10 ఓవర్లు - 46 పరుగులు - 1 వికెట్ 

యఙవేంద్ర చాహల్        10 ఓవర్లు - 51 పరుగులు - 4 వికెట్లు  

కేదార్ జాదవ్                4  ఓవర్లు - 16  పరుగులు - 0 

Tags:    

Similar News