India-Srilanka: మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం టీమిండియా శ్రీలంక టూర్ వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో మొదటి వన్డే కొద్ది సేపటి క్రితమే ప్రారంభమైంది. టాస్ గెలిచిన లంక కెప్టెన్ డాసక్ షనాక ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టుకు శిఖర్ ధవన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం శ్రీలంక 25 ఓవర్లు పూర్తయ్యే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది.
శ్రీలంక బ్యాటింగ్:-
117/4 (25 ఓవర్లు)
డాసక్ షనాక : 1
అస్లాంక : 14 గ్రీజులో ఉన్నారు.
ఇండియా బౌలింగ్ :-
కులదీప్ యాదవ్ : 2/32 (3)
చాహల్ : 1/24 (4)
క్రునాల్ పాండ్య: 1/9(5)
టీమ్ ఇండియాలో కొత్తగా ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్‌లకు వన్డే జట్టులో చోటు దక్కింది. పుట్టిన రోజు నాడే తన కెరీర్లో మొదటి వన్ డే మ్యాచ్ ఆడి తన అరంగేట్రాన్ని తీపి జ్ఞాపకంగా మార్చుకున్నాడు ఇషాన్ కిషన్. ఇది ఈ యంగ్ క్రికెటర్ కు బర్త్ డే గిఫ్ట్ అనే చెప్పాలి. ప్రస్తుతం కొత్తగా జట్టులో చేరిన కుర్రాళ్ళతో టీమిండియా స్ట్రాంగ్ గా కనిపిస్తోందని చెప్పాలి. గత కొంత కాలంగా మంచి ఫామ్ లో ఉన్న టీమిండియాతో ఇంగ్లండ్ తో ఓటమి బాధలో ఉన్న శ్రీలంక ఎలా ఎదుర్కుంటుందో చూడాలి. ప్రస్తుత శ్రీలంక సిరీస్ లో భారత్ రాణిస్తే జట్టులో చేరిన కుర్రాళ్ళకు భవిష్యత్తులో జరగబోయే ప్రపంచ కప్ లో మరిన్ని అవకాశాలు రావచ్చు.