Corona Effect: భారత్‌-సౌతాఫ్రికా సిరీస్‌ రద్దు!

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియా - సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ కు కరోనా సెగ తగిలింది. ఈ సిరీస్ రద్థు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

Update: 2020-03-13 13:15 GMT
India Vs SA ODI series

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియా - సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ కు కరోనా సెగ తగిలింది. ఈ సిరీస్ రద్థు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ మ్యాచ్‌కు తొలి వన్డేకు వర్షం అడ్డంకిగా మారండంతో మ్యాచ్ రద్దు అయింది. ఇక మిగిలిన రెండు వన్డేలను బీసీసీఐ రద్దు చేసింది. కాగా. షెడ్యూల్ ప్రకారం ఇరు జట్ల మధ్య జరగాల్సిన రెండో వన్డే మార్చి 15న ఆదివారం లక్నోలో, కోల్‌కతాలో మార్చి 18న జరగనున్న మూడో వన్డే జరగనుంది. ఇప్పటికే పలు స్పోర్ట్స్‌ ఈవెంట్‌లు రద్దు అయిన సంగతి తెలిసిందే.

దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం సూచనల మేరకు.. క్రీడాశాఖ స్పోర్ట్స్ ఫెడరేషన్స్‌కు స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ జారీ చేసింది. క్రీడా పోటీలు ఏవైనా నిర్వహించాలని అనుకుంటే జనాలు లేకుండా నిర్వహించాలని తెలిపింది. దీంతో ప్రస్తుతం టీమిండియా-సౌతాఫ్రికా రెండు, మూడు వన్డేలకు కూడా ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. అభిమానులకు ఎంట్రీ లేకుండా మిగిలిన రెండు వన్డేలు నిర్వహించాలని చూశారు. భారత్ లో కరోనా విజృంభించడంతో దక్షిణాఫ్రికా క్రికెటర్లు స్వదేశాని పయనం అయ్యారు. ఐపీఎల్ కూడా వాయిదా పడింది.


 

Tags:    

Similar News