మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు అయిదు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం భారత్ నాలుగు వికెట్లు కోల్పయి 39 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో దీప్తి శర్మ (10), వేదా (5) ఉన్నారు. అంతకుముందు హర్మన్‌ప్రీత్ (4), స్మృతి మంధాన (11), జెమిమా (0), షెఫాలీ వర్మ(2) అవుట్ అయ్యారు. ఇక మొదటగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.