మొదటి వన్డేలో భారత్ ఓటమి

Update: 2019-12-15 16:38 GMT
హెట్‌మైర్

చెన్నై వేదికగా వెస్టిండిస్ జట్టుతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోయింది. భారత్ నిర్దేశించిన 289 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ జట్టు 47.5 ఓవర్లలో అయిదు వికెట్లను కోల్పోయి చేధించింది. విండీస్ బ్యాట్స్‌మెన్ లలో హెట్‌మైర్ సెంచరీ(90 బంతుల్లో 106: 9 ఫోర్లు, 4 సిక్సర్లు)తో విరుచుకుపడ్డాడు. అతనికి తోడుగా ఓపెనర్ షై హోప్(110 బంతుల్లో 60 పరుగులు) అర్ధసెంచరీ సాధించి చక్కటి సహకారాన్ని అందించాడు. దీనితో విండిస్ జట్టు విజయం ఖరారు అయింది.

అంతకుముందు టాస్ ఒడి బ్యాటింగ్ కి దిగిన భారత జట్టు నిర్ణిత 50 ఓవర్లలో ఎనమిది వికెట్లను కోల్పోయి 288 పరుగుల చేసింది. ఇందులో భారత బాట్స్ మెన్స్ శ్రేయాస్ అయ్యర్ 70 పరుగులు (5 *4 1*6 ) , రిషబ్ పంత్ 70 పరుగులు (7 *4 1*6 ) పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ ని అందజేశారు. కానీ బౌలింగ్ విభాగంలో భారత జట్టు విఫలం కావడంతో విండిస్ జట్టు ముందు ఓడిపోయింది. 

Tags:    

Similar News