India vs New Zealand 2nd test Day 2: మారని ఆట.. భారత్ 90/6

Update: 2020-03-01 07:40 GMT
India vs New Zealand 2nd test (File Photo)

క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా న్యూజిలాండ్, భారత జట్ల మద్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో వచ్చిన మంచి అవకాశాన్ని టీంఇండియా చేజార్చుకుంది. మొదటి ఇన్నింగ్స్ లో 242 పరుగులకి ఆలౌట్ అయిన భారత్ జట్టు ఆతిధ్య జట్టును 235 పరుగులకే ఆలౌట్ చేసి పర్వాలేదు అనిపించి ఏడూ పరుగుల ఆధిక్యాన్ని సంపాదించుకుంది. ఇక రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ ని సాధించే క్రమంలో వరుస వికెట్లను కోల్పోయింది. రెండో రోజు అట ముగిసే సమయానికి భారత జట్టు 36 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టానికి 90పరుగులే చేసింది.

కివీస్‌ బౌలర్లు ధాటికి భారత బ్యాట్స్ మెన్స్ ఒక్కరు కూడా నిలదొక్కుకోలేకపోయారు. . పృథ్వీషా(14), మయాంక్‌ అగర్వాల్‌(3), విరాట్‌ కోహ్లీ(14), ఛెతేశ్వర్‌ పుజారా(24), అజింక్య రహానె(9), ఉమేశ్‌ యాదవ్‌(1) వరుసుగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ప్రస్తుతం క్రీజ్ లో హనుమ విహారి(5), రిషభ్‌ పంత్‌(1) ఉన్నారు. మూడో రోజు వీరి ఆటను బట్టి జట్టు విజయ అవకాశాలు అధారిపడి ఉన్నాయి. ప్రస్తుతం భారత్ 97 పరుగులతో ఉంది. కివీస్ బౌలర్లలో ట్రెంట్‌బౌల్ట్‌ 3 వికెట్లతో చెలరేగగా.. సౌథీ, గ్రాండ్‌హోమ్‌, వాగ్నర్‌ చెరో వికెట్‌ తీశారు.

అంతకుముందు 63/0తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కివీస్ జట్టుకు ఆదిలోనే ఉమేశ్‌ యాదవ్‌ పెద్ద షాకిచ్చాడు. 25.3 ఓవర్‌లో టామ్‌ బ్లండెల్‌(30)ను ఎల్బీగా పెవిలియన్‌ పంపాడు. మరో మూడు పరుగుల వ్యవధిలో కెప్టెన్‌ విలియమ్సన్‌(3)ను బుమ్రా బోల్తా కొట్టించాడు. ఇక ఆ తర్వాత వచ్చిన రాస్‌టేలర్‌(15)తో కలిసి టామ్‌ లాథమ్‌(52) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఇద్దరు కలిసి 40 పరుగుల జోడించాక జడేజా టేలర్‌ ని అవుట్ చేసి వీరిని విడదీశాడు.

ఇక కాసేపటికే లాథమ్‌(52) షమి బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అనంతరం హెన్రీ నికోల్స్‌(14)కూడా వెంటనే వెనుదిరిగాడు. దీనితో కివీస్ జట్టు 142 పరుగులకే అయిదు వికెట్లను కోల్పోయింది. ఇక ఆ తరవాత వచ్చిన డి గ్రాండ్‌హోమ్‌(26), కైల్‌ జేమిసన్‌(49) కొద్దిసేపు జట్టును ఆదుకున్నారు. దీనితో ఆ జట్టు 200 మార్క్ ని దాటింది. ఆ తర్వాత కివీస్ వరుస వికెట్లను కోల్పోయి 235 పరుగులకు ఆలౌట్ అయింది..భారత బౌలర్లలలో మహ్మద్‌ షమి(4), జస్ప్రీత్‌ బుమ్రా(3), జడేజా(2) వికెట్లు తీశారు.

Tags:    

Similar News