నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో టీంఇండియా
వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మద్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు కీలకమైన నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.
వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మద్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు కీలకమైన నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (58) ఔటైన కొద్దిసేపటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ(19) సైతం అవుట్ అయ్యాడు. ముందుగా మయాంక్, సౌథీ బౌలింగ్‌లో కీపర్ వాట్లింగ్ చేతికి చిక్కడంతో భారత్ 96 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. తర్వాత కోహ్లీ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో కీపర్‌కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో భారత్ 113 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. అంతకుముందు పుజారా(11), పృథ్వీషా(14) అవుట్ అయ్యారు.. మూడో సెషన్ ముగేసేసరికి భారత జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో క్రీజులో అజింక్య రహానె(13), హనుమ విహారి(9) పరుగులతో ఉన్నారు.
అంతకుముందు 216 పరుగులకి అయిదు వికెట్లు కోల్పోయి ఆదివారం మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ 348 పరుగులకి అల్ అవుట్ అయింది. మూడో రోజు ఆట ప్రారంభించిన తొలి బంతికే బుమ్రా బౌలింగ్‌లో వాట్లింగ్.. కీపర్ రిషభ్ పంత్ చేతికి చిక్కాడు. దీంతో కివీస్ ఆరో వికెట్ కోల్పోయింది. అనంతరం ఇషాంత్ బౌలింగ్‌లో టిమ్‌సౌథీ(6) అవుట్ అయ్యాడు. దీనితో ఏడూ వికెట్లను కోల్పోయింది కివీస్ .. ఈ తరుణంలో కొలిన్ డి గ్రాండ్‌హోమ్(43), కైల్ జేమీసన్(44) మరో వికెట్ పడకుండా జట్టును ఆదుకున్నారు. ఇద్దరు కలిసి 71 పరుగులు జోడించారు. ఆ తర్వాత వీరి జోడిని అశ్విన్ విడదీశాడు. ఆ కొద్దిసేపటికే గ్రాండ్‌హోమ్‌ను కూడా అశ్వినే వెనక్కి పంపించాడు.
ఆ తర్వాత వచ్చిన అజాజ్ పటేల్(4), ట్రెంట్‌బౌల్ట్(38) పరుగులు చేశారు. చివరికి ఇషాంత్ బౌలింగ్‌లో ట్రెంట్‌బౌల్ట్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీనితో 348 పరుగులకి కివీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో 183 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకుంది. భారత బౌలర్లలో ఇషాంత్(5), అశ్విన్(3), షమి(1), బుమ్రా (1) వికెట్లు పడగొట్టారు.అంతకుముందు భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 165 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.