Road Safety World Series: వారెవ్వా.. రఫ్ ఆడేసిన సెహ్వాగ్ , సచిన్ జోడి

"వరల్డ్ రోడ్ సేఫ్టీ సిరీస్‌"లో భాగంగా ఆదివారం సాయంత్రం ముంబై వేదికగా శ్రీలంక లెజెండ్స్-ఆస్ట్రేలియా లెజెండ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది

Update: 2020-03-08 06:42 GMT
Road Safety World Series 2020

"వరల్డ్ రోడ్ సేఫ్టీ సిరీస్‌"లో భాగంగా ఆదివారం సాయంత్రం ముంబై వేదికగా శ్రీలంక లెజెండ్స్-ఆస్ట్రేలియా లెజెండ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. శనివారం విండీస్ లెజెండ్స్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ఆటలో వన్నె తగ్గలేదని నిరూపించాడు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికినా.. తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ క్రికెట్ దిగ్గజం సచిన్‌తో కలిసి మెరుపులు మెరిపించాడు. హ్యాట్రిక్ ఫోర్లతో సచిన్, ఆర్థసెంచరీతో సెహ్వాగ్ అభిమానులకు మజానందిచారు. మళ్లీ ఆనాటి రోజులను గుర్తు తెచ్చారు. సచిన్, సెహ్వాగ్, యువరాజ్, కైఫ్, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్ ఇలా అనాటి దిగ్గజ ఆటగాళ్లందరూ.. కలిసి ముంబైలో మ్యాచ్ ఆడేశారు.సెహ్వాగ్ , సచిన్ టెండూల్కర్, బ్యాటింగ్ పై అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. 

మహారాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు నిర్వహిస్తున్న "వరల్డ్ రోడ్ సేఫ్టీ సిరీస్‌"లో టీమిండియా మాజీ ఆటగాళ్లంతా సందడి చేశారు. సచిన్ కెప్టెన్ గా ఇండియా లెజెండ్స్..ఒక వైపు లారా నాయకత్వంలోని వెస్టిండీస్ లెజెండ్స్‌ ఒకవైపు ఇద్దరు దిగ్గజాలతో జరిగిన మ్యాచ్ ఆధ్యంతం రసవత్తరంగా మారింది. వయసు మీద పడ్డా ఆడం అంటే ఆడాం అని కాకుండా పూర్వవైభవాన్ని గుర్తు తెచ్చారు. ఇండియా లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్‌ ఆటగాళ్లు.

సచిన్ నేతృత్వంలోని మాజీ క్రికెటర్లతో కూడిన ఇండియా లెజెండ్స్ సిరీస్ ప్రారంభ మ్యాచ్‌లోనే ఏడు వికెట్లతో వెస్టిండీస్ లెజెండ్స్‌పై ఘన విజయం సాధించింది. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (74 పరుగులు , 57 బంతుల్లో, 11 ఫోర్లతో ) నాటౌట్ మెరుపు ఆర్థ శతకానికి తోడు కెప్టెన్ సచిన్ టెండూల్కర్ (36 పరుగులు, 29 బంతుల్లో) రాణించడంతో ఇండియా లెజెండ్స్ అలవోకగా విజయాన్నందుకుంది. విండీస్ లెజెండ్స్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 150 పరుగులు చేసింది. చందర్‌పాల్ (61), డారెన్ గంగా (32) సత్తాచాటారు.

అనంతరం సెహ్వాగ్ మెరుపు ఇన్నింగ్స్ తో 18.2 ఓవర్లలోనే విజయం సాధించింది. సెహ్వాగ్‌ సచిన్ ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ సిరీస్‌లో శ్రీలంక, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా లెజెండ్స్ పోటీపడుతున్నాయి. మార్చి 10న శ్రీలంక లెజెండ్స్‌తో, భారత లెజెండ్స్ తలపడనుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య 1.35 మిలియన్లు ఉండగా.. కేవలం ఇండియాలోనే 1,49000 ఉండటం గమనార్హం.




 


Tags:    

Similar News