వరల్డ్ కప్ టోర్నీ లో తన తోలి మ్యాచ్ లో విజయం కోసం టీమిండియా ఎదురీదుతోంది. 227 పరుగులకు ప్రత్యర్థి సోతాఫ్రికాను కట్టడి చేయగలిగినప్పటికీ.. ఆ స్వల్ప స్కోరును ఛేదించటానికి తోలి ఓవర్ నుంచే అష్ట కష్టాలూ పడుతోంది. బంతి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్న పిచ్ మీద కుదురుకోలేక.. ఓపెనర్ ధావన్.. తరువాత కెప్టెన్ కోహ్లీ వెనక్కి వచ్చేశారు. కెఎల్ రాహుల్ తో కలసి పట్టు వదలని పోరాటం చేస్తున్నాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలో తన అర్థ సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఇక కెఎల్ రాహుల్ కూడా చక్కని సహకారం అందిస్తున్నాడు. సగానికి పైగా ఓవర్లు అయిపోయిన వేళలో ఇంకా విజయానికి 126 పరుగులు అవసరం. 8 వికెట్లు.. 24 ఓవర్లూ ఉన్నాయి. ప్రస్తుతం భారత్ స్కోరు రెండు వికెట్లను 102