రోహిత్ శర్మ తో కలసి నిలకడగా ఇన్నింగ్స్ నిలబెట్టిన రాహుల్ 26 పరుగుల వద్ద రబడా వేసిన బంతి ఆడబోయి డుప్లిసిస్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తరువాత బ్యాటింగ్ కు వచ్చిన ధోనీ రోహిత్ కు తోడుగా నిదానంగా ఆడుతున్నాడు. 35 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు 150 పరుగులు పూర్తి చేసుకుంది. క్రీజులో రోహిత్ శర్మ (88 ) పరుగులతోనూ, ధోనీ (5 ) పరుగులతోనూ ఉన్నారు. ఇంకా 15 ఓవర్లలో 78 పరుగులు చేయాల్సి ఉంది.