మూడో టెస్టులో విజయం దిశగా భారత్‌

Update: 2018-12-29 02:39 GMT

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్ట్‌లో భారత్‌ విజయం దిశగా పయనిస్తోంది. 54/5 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో నాల్గో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లిసేన మరో 52 పరుగుల జోడించి 106/8 వద్ద డిక్లేర్డ్‌ చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (42), రిషభ్‌ పంత్‌లు ఆరో వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించగా.. రవీంద్ర జడేజా (5) పరుగులు చేశాడు. దీంతో ఆసీస్‌ ముందు 399 పరుగుల లక్షాన్ని విధించారు. అనంతరం సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్ జట్టు ఆదిలోనే ఓపెనర్లు అరోన్‌ ఫించ్‌ (3), మార్కస్‌ హర్రీస్‌ (13)ల వికెట్లు కోల్పోయింది. మూడో వికెట్ కౌజ(33). ప్రస్తుతం ఆసీస్ స్కోర్ మూడు వికెట్ల నష్టానికి 63 పరుగులు. రెండు వికెట్లలో జడేజా, బుమ్రా చెరో ఒకటి తీశారు. కాగా భారత్, టీమిండియా స్కోర్ వివరాలు ఇలా ఉన్నాయి.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 443/7 డిక్లేర్డ్‌, రెండో ఇన్నింగ్స్‌ 106/8 డిక్లేర్డ్‌

ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 151 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 63/3

Similar News