టీమిండియా ఓపెనర్ శిఖర్ ధాయన్‌కు గాయం

అయితే వెస్టిండీస్ సిరీస్ మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుండగా శిఖర్ ధావన్ గాయపడ్డాడు.

Update: 2019-11-22 02:47 GMT

టీమిండియా వెస్టిండీస్ మధ్య డిసెంబరు 6 టీ20, వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. భారత జట్టు స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అయితే వెస్టిండీస్ సిరీస్ మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుండగా శిఖర్ ధావన్ గాయపడ్డాడు. విండీస్ సిరీస్ కొద్దీ రోజులు ముందు ధావన్ గాయపడడం జట్టును కలవర పెడుతుంది.

దేశవాళీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో శిఖర్ ధావన్ మోకాలికి గాయమైంది. ఢిల్లీ తరఫున ఆడుతున్న ధావన్ ఈ మ్యాచ్‌లో 24 పరుగులు 22 బంతుల్లో సాధించాడు. అనంతరం ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డ ధావన్‌ను ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స తీసుకున్న ధావన్ అక్కడి సిబ్బందితో ఫోటోలకు ఫోజులిచ్చారు. తన స్టయిల్‌లో తొడగొట్టి ఆసుపత్రి సిబ్బందిని అలరించారు. వెస్టిండీస్ మ్యాచ్‌లో బరిలోకి దిగుతానని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఫోటోలను తన వ్యక్తిగత ట్విటర్లో‌ షోస్టు చేశారు. 


Tags:    

Similar News