IND Vs BAN: రెండో టెస్టులో బంగ్లాదేశ్ పై భారత్ విజయం

IND Vs BAN: 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై విజయం

Update: 2022-12-25 05:40 GMT

IND Vs BAN: రెండో టెస్టులో బంగ్లాదేశ్ పై భారత్ విజయం

IND Vs BAN: ఉత్కంఠభరితంగా సాగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ పై భారత్ విజయం సాధించింది. దీంతో బంగ్లాదేశ్ సీరిస్ ను క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టు దాదాపు టీంఇండియా చేయ్యి జారిపోతున్న సమయంలో టెయిలెండర్స్ దూకుడుగా ఆడటంతో మ్యాచ్ ఇండియా వైపు టర్న్ అయ్యింది. ఉత్కంఠ పోరులో బంగ్లా దేశ్ పై భారత్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు టెస్టుల్లోనూ బంగ్లాదేశ్ పై విజయం సాదించడం ద్వారా.. సీరిస్ ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది.

బంగ్లాదేశ్ నిర్దేశించిన టార్గెట్.. 145 రన్స్ ను చేధించడానికి టీంఇండియా బ్యాట్స్ మెన్స్ తీవ్రంగా శ్రమించారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోతూ.. 4 వికెట్లు నష్టానికి 45 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగురోజు ఆట ప్రారంబించిన భారత్.. ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. అయ్యర్, అశ్విన్ నిలకడగా ఆడుతూ కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసి.. మ్యాచ్ ను పూర్తిగా టర్న్ చేశారు. దీంతో బంగ్లాపై ఇండియా విజయం సాధించింది.

భారత్‌-బంగ్లాదేశ్‌ రెండో టెస్టు మంతి రసవత్తరంగా సాగింది. చేతిలో ఆరు వికెట్లున్నాయి. ఇంకో వంద పరుగులు చేస్తే చాలు.. రెండో టెస్టు మనోళ్లదే. చూడ్డానికి ఈ సమీకరణం చాలా తేలిగ్గా అనిపించొచ్చు. కానీ 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. 45 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడం ఆందోళన కలిగించింది. బాల్ గింగిరాలు తిరుగుతున్న పిచ్‌పై నిలవడం సవాలుగా మారి.. పుజారా, శుభ్‌మన్‌ స్టంపౌట్‌ అయిపోయారు. కోహ్లి 22 బంతులాడి ఒక్క పరుగే చేసి వెనుదిరిగాడు. ఈరోజు మ్యాచ్ ప్రారంభమైన తర్వాత కూడా బారత్ వరుసగా వికెట్లు కోల్పోయిన తరుణంగా..

దీన్ని బట్టి నాలుగో రోజు ఛేదన అంత తేలిక కాదన్నది స్పష్టం. మరి ఈ సవాలును అధిగమించి టీమ్‌ఇండియా సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తుందా.. లేక బంగ్లాకు సమం చేసే అవకాశం ఇస్తుందా?

భారత్‌-బంగ్లాదేశ్‌ రెండో టెస్టు మంతి రసవత్తరంగా సాగింది.

బంగ్లాదేశ్‌ నిర్దేశించిన 145 పరుగులు స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్‌ కష్టాలు పడుతోంది. స్పిన్‌కు దాసోహం అంటున్న పిచ్‌పై పరుగులు కూడగట్టడం సవాలుగా మారింది. మూడో రోజు చివరి సెషన్లో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌.. 23 ఓవర్లు బ్యాటింగ్‌ చేసి ఆట ఆఖరుకు 45/4తో నిలిచింది. ఓపెనర్లు రాహుల్‌ (2), శుభ్‌మన్‌ (7)లతో పాటు పుజారా (6), కోహ్లి (1)ల వికెట్లు కోల్పోయి భారత్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. విరాట్‌ కంటే ముందు నాలుగో స్థానంలో వచ్చిన అక్షర్‌ (26 బ్యాటింగ్‌) ఒక్కడే ఒత్తిడికి గురి కాకుండా బ్యాటింగ్‌ చేశాడు. అతడికి తోడుగా నైట్‌ వాచ్‌మన్‌ ఉనద్కత్‌ (3) క్రీజులో ఉన్నాడు. మెహిదీ హసన్‌ మిరాజ్‌ (3/12) భారత్‌ను దెబ్బ తీశాడు. అంతకుముందు 7/0తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన బంగ్లా.. లిటన్‌ దాస్‌ (73; 98 బంతుల్లో 7×4) జాకిర్‌ హసన్‌ (51; 135 బంతుల్లో 5×4), నురుల్‌ (31), తస్కిన్‌ అహ్మద్‌ (31 నాటౌట్‌)ల పోరాటంతో 231 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ (3/68), సిరాజ్‌ (2/41), అశ్విన్‌ (2/66) రాణించారు.

బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో అనుకున్నదాని కంటే పెద్ద స్కోరే చేసినా.. తొలి ఇన్నింగ్స్‌లో 87 పరుగుల ఆధిక్యం సాధించడంతో భారత్‌ ముందు చిన్న లక్ష్యమే నిలిచింది. కానీ పిచ్‌, బంగ్లా స్పిన్నర్ల ప్రతిభ వల్ల కాసేపటికే అతి కొండలా మారిపోయింది. స్పిన్నర్లకు బాగా సహకరిస్తున్న పిచ్‌పై పరుగులు తీయడం సంగతటుంచితే డిఫెన్స్‌ ఆడడం కూడా చాలా కష్టమైపోయింది. షకిబ్‌, తైజుల్‌, మెహిదీ మిరాజ్‌ ముప్పేట దాడి చేసి భారత బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఘోర వైఫల్యాన్ని కొనసాగిస్తూ తాత్కాలిక కెప్టెన్‌ రాహుల్‌.. మూడో ఓవర్లోనే షకిబ్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత పుజారా, శుభ్‌మన్‌ ఒకరి తర్వాత ఒకరు మిరాజ్‌ బౌలింగ్‌లో స్టంపౌటయ్యారు. క్రీజు లోపలుండి ఆడితే బంతులు ఎడ్జ్‌ అవుతుండడంతో వీళ్లిద్దరూ బయటికొచ్చి డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేశారు. కానీ వారి అంచనాలకు భిన్నంగా టర్న్‌ అయిన బంతులు బోల్తా కొట్టించాయి. ఈ సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేస్తున్న కోహ్లి.. కీలకమైన ఈ ఇన్నింగ్స్‌లో అయినా సత్తా చాటాలని కొన్ని ఓవర్ల పాటు సహనంతో క్రీజులో నిలిచాడు. కానీ అతడి పట్టుదలకు మిరాజే తెరదించాడు. విరాట్‌ డిఫెన్స్‌ ఆడాక తక్కువ ఎత్తులో గాల్లో లేచిన బంతిని షార్ట్‌ లెగ్‌లో మొమినుల్‌ చక్కగా అందుకున్నాడు. అయితే ప్రధాన బ్యాట్స్‌మెన్‌ ఇలా తడబడితే.. కోహ్లి కంటే ముందు నాలుగో స్థానంలో వచ్చిన అక్షర్‌ పటేల్‌ ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేశాడు. కాబట్టే మూడో రోజు భారత్‌ ఆమాత్రం పరుగులైనా చేయగలిగింది. భారత ఇన్నింగ్స్‌లో పడ్డ 23 ఓవర్లలో 22 బంగ్లా స్పిన్‌ త్రయం వేసినవే. ఆదివారం ఈ త్రయాన్ని ఎదుర్కొని ఛేదన పూర్తి చేయడం భారత్‌కు సవాలే. క్రీజులో ఉన్న అక్షర్‌తో పాటు శ్రేయస్‌, పంత్‌, అశ్విన్‌ల మీదే అభిమానుల ఆశలు నిలిచి ఉన్నాయి.

రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా చేసిన 231 పరుగులు చిన్న స్కోరులా కనిపించినా.. మ్యాచ్‌ పరిస్థితుల్లో పెద్దదే. భారత బౌలర్ల నిలకడ లేమి ప్రత్యర్థి జట్టుకు బాగానే కలిసొచ్చింది. 7/0తో శనివారం ఉదయం బ్యాటింగ్‌ కొనసాగించిన బంగ్లా.. తొలి సెషన్లో తడబడింది. భారత బౌలర్లు సమష్టిగా రాణించడంతో నజ్ముల్‌ శాంటో (5), మొమినుల్‌ (5), షకిబ్‌ (13), ముష్ఫికర్‌ (9) పెవిలియన్‌కు వరుస కట్టారు. లంచ్‌కు బంగ్లా స్కోరు 71/4. విరామం తర్వాత కూడా భారత బౌలర్లు ఒత్తిడి కొనసాగించారు. ఓ ఎండ్‌లో నిలకడగా ఆడుతున్న జాకిర్‌తో పాటు మిరాజ్‌ను ఔట్‌ చేశారు. ఈ ఊపు కొనసాగి ఉంటే భారత్‌ ముందు వంద లోపు లక్ష్యమే నిలిచేది. కానీ లిటన్‌ దాస్‌తో పాటు నురుల్‌ (31), తస్కిన్‌ భారత బౌలర్లపై ఎదురు దాడి చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. విలువైన పరుగులు జోడించి జట్టు స్కోరును 200 దాటించారు. ఫీల్డింగ్‌ తప్పిదాలు కూడా ఆ జట్టుకు కలిసొచ్చాయి. కోహ్లి స్లిప్‌లో లిటన్‌ క్యాచ్‌లు మూడు వదిలేశాడు.

బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: 227

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 314

బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌: నజ్ముల్‌ ఎల్బీ (బి) అశ్విన్‌ 5; జాకిర్‌ (సి) సిరాజ్‌ (బి) ఉమేశ్‌ 51; మొమినుల్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 5; షకిబ్‌ (సి) శుభ్‌మన్‌ (బి) ఉనద్కత్‌ 13; ముష్ఫికర్‌ ఎల్బీ (బి) అక్షర్‌ 9; లిటన్‌ (బి) సిరాజ్‌ 73; మిరాజ్‌ ఎల్బీ (బి) అక్షర్‌ 0; నురుల్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) అక్షర్‌ 31; తస్కిన్‌ నాటౌట్‌ 31; తైజుల్‌ ఎల్బీ (బి) అశ్విన్‌ 1; ఖాలెద్‌ రనౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (70.2 ఓవర్లలో ఆలౌట్‌) 231

వికెట్ల పతనం: 1-13, 2-26, 3-51, 4-70, 5-102, 6-113, 7-159, 8-219, 9-220

బౌలింగ్‌: ఉమేశ్‌ 9-1-32-1; అశ్విన్‌ 22-2-66-2; ఉనద్కత్‌ 9-3-17-1; సిరాజ్‌ 11-0-41-2; అక్షర్‌ 19.2-1-68-3

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: శుభ్‌మన్‌ (స్టంప్డ్‌) నురుల్‌ (బి) మిరాజ్‌ 7; రాహుల్‌ (సి) నురుల్‌ (బి) షకిబ్‌ 2; పుజారా (స్టంప్డ్‌) నురుల్‌ (బి) మిరాజ్‌ 6; అక్షర్‌ బ్యాటింగ్‌ 26; కోహ్లి (సి) మొమినుల్‌ (బి) మిరాజ్‌ 1; ఉనద్కత్‌ బ్యాటింగ్‌ 3; ఎక్స్‌ట్రాలు 0 మొత్తం: (23 ఓవర్లలో 4 వికెట్లకు) 45

వికెట్ల పతనం: 1-3, 2-12, 3-29, 4-37

బౌలింగ్‌: షకిబ్‌ 6-0-21-1; తైజుల్‌ 8-4-8-0; మెహిదీ మిరాజ్‌ 8-3-12-3; తస్కిన్‌ 1-0-4-0

కోహ్లి × బంగ్లా

ఈ పర్యటనలో బంగ్లాదేశ్‌ ఆటగాళ్లతో విరాట్‌ కోహ్లికి అస్సలు పొసగట్లేదు. వాళ్లు పదే పదే రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుండడంతో విరాట్‌ నోటికి పని చెబుతున్నాడు. రెండో టెస్టు రెండో రోజు బంగ్లా ఓపెనర్‌ నజ్ముల్‌ శాంటో సాక్స్‌ మార్చుకునే పేరుతో ఉద్దేశపూర్వకంగా సమయం వృథా చేస్తుండడంతో.. ''అంతటితో ఆగిపోయావేం.. బట్టలు కూడా మార్చుకో'' అంటూ విరాట్‌ వ్యంగ్యంగా సంజ్ఞ చేయడం చర్చనీయాంశం అయింది. ఇక మూడో రోజు ఆట ఆఖర్లో కోహ్లి వికెట్‌ పడ్డాక బంగ్లా ఆటగాళ్ల సంబరాలు శ్రుతిమించాయి. తైజుల్‌ తీరు నచ్చక అతడితో విరాట్‌ వాగ్వాదానికి దిగాడు. అంపైర్లు సర్దిచెప్పి అతణ్ని పెవిలియన్‌కు పంపారు. వెళ్తూ వెళ్తూ విరాట్‌ తన కోపాన్ని చూపిస్తూ కదిలాడు.

Tags:    

Similar News