IND vs SA 1st test : దక్షిణాఫ్రికా ముందు 395 పరుగుల భారీ లక్ష్యం

విశాఖ‌ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మొదటి టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు ఒక వికెట్ నష్టపోయి 11 పరుగులు చేసింది. ఐదో రోజు సౌతాఫ్రికా గెలవాలంటే 384 పరుగుల చేధించాల్సి ఉంటుంది.

Update: 2019-10-05 12:04 GMT

విశాఖ‌ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మొదటి టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు ఒక వికెట్ నష్టపోయి 11 పరుగులు చేసింది. ఐదో రోజు సౌతాఫ్రికా గెలవాలంటే 384 పరుగుల చేధించాల్సి ఉంటుంది. అంతకుముందు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీం ఇండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 7పరుగులు చేసి నిరాశపరిచాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మకు పుజార జత కలవడంతో భారత్ స్కోర్ దూసుకెళ్లింది.. రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‎కు 169 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 13 ఫోర్లు, 7సిక్స్ లతో 81పరుగుల చేసిన పుజార జట్టు స్కోరు 190 వద్ద అవుటైయ్యాడు. 10ఫోర్లు ఏడు సిక్స్ తో సాధించి సెంచరీతో అదరగొట్టిన రోహిత్ 127 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం జడేజా(40) ఔట్, కోహ్లీ(31) నాటౌట్, రహానే (27)నాటౌట్ రాణించారు. రెండో ఇన్నింగ్స్ నాలుగు వికెట్లు కొల్పోయిన 323/4 డిక్లెర్ ప్రకటించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మహరాజ్ రెండు వికెట్లు తీసుకోగా..వినమ్ రబడా చెరో వికెట్ పడగొట్టారు.

ఆటలో నాలుగోరోజు 385/8తో తొని ఇన్నింగ్స్ ని కొనసాగించిన దక్షిణాఫ్రికా 431పరుగులకు ఆలౌటయింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో 502/7 డిక్లేర్ చేసి ఉన్నభారత్ 71పరుగుల ఆదిక్యం సాధించింది. 

Tags:    

Similar News